Sai Dharam Tej: సినీ ఇండస్ట్రీ హీరో హీరోయిన్స్ పై తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నటీనటులు పెళ్లికి సంబంధించిన వార్తలు మరీ వైరలవుతుంటాయి. అయితే కొద్దిరోజులుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సాయిధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్ డేటింగ్ లో ఉన్నారని.. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ మొదలయ్యాయి. 2017లో విడుదలైన జవాన్ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ రొమాన్స్‌గా వికసించిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మెహరీన్ తో పెళ్లి పై క్లారిటీ
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందిస్తూ.. హీరోయిన్ తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలన్ని కేవలం రూమర్స్ మాత్రమేనని. సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి ఏదైనా ఉంటే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాము అని తెలిపింది. దీంతో వీళ్ళిద్దరి పెళ్లి రూమర్స్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్- రెజీనా కసాండ్రాను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
సాయి ధరమ్
సాయి ధరమ్ తేజ్ 2014లో పిల్లా నువ్వు లేని జీవితంతో సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది ఆక్సిడెంట్ తర్వాత ‘విరూపాక్ష’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక మెహరీన్ విషయానికి వస్తే.. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్, F2 సినిమాలతో తెలుగులో మంచి పేరు సంపాదించుకుంది. అయితే గతంలో మెహరీన్ కు భవ్య బిష్ణోయ్‌తో వివాహం నిశ్చయించారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది రద్దైంది