Samantha Hiring Jobs : టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం ఈ హీరోయిన్ ‘సాకీ’ అనే దుస్తుల బ్రాండ్ ని స్థాపించింది.
ఈ బ్రాండ్ కి సంబంధించిన దుస్తులకు మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. సామ్ కి కూడా సాకీ(Saaki) బ్రాండ్ దుస్తులంటే చాల ఇష్టం. ఇక ఇదే కంపెనీలో జాబ్స్ ఉన్నట్లు సమంత తాజాగా ఓ ప్రకటన చేసింది. సొషల్ మీడియా వేదికగా సామ్ ఈ విషయాన్ని పోస్ట్ రూపంలో తెలియజేసింది.
సమంత దగ్గర ఉద్యోగం చేయాలంటే కావాల్సిన అర్హతలు ఇవే
సమంత తన దుస్తుల బ్రాండ్ ‘సాకీ’ లో జాబ్స్ ఉన్నాయని ప్రకటన చేసింది. అందుకు సరిపడా అర్హతలు ఉన్నవాళ్లు సంప్రదించవచ్చని మెయిల్ ని పొందు పర్చింది. సాకీలో ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ ఉద్యోగాలు ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వొచ్చని తెలిపింది.
దీంతో పాటూ సమంత ఏకమ్ ఎర్లీ లర్నింగ్ పేరుతో చిన్న పిల్లల కోసం ఓ ప్లే స్కూల్ రన్ చేస్తోంది. ఈ స్కూల్ లో పిల్లల్ని జాయిన్ చేసేందుకు కావాల్సిన వివరాలు తెలుసుకునేందుకు 9154900466 కాల్ చేయాల్సిందిగా నెంబర్ ని కూడా షేర్ చేసింది.