S. Abdul Nazeer: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు రాజ్ భవన్ సిబ్బంది. ప్రస్తుతం ఆయనకు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అబ్దుల్ నజీర్ కు ఎండోస్కోపిక్ పరీక్షను వైద్యులు చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అయితే, గవర్నర్ ఆరోగ్య స్థితిపై రాజ్ భవన్ బృందం ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.