Rushikonda: రుషికొండ నిర్మాణాలు కూల్చేయండి అంటూ కేంద్రానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి EAS శర్మ లేఖ రాశారు. రుషికొండ నిర్మాణాలు వెంటనే కూల్చేయాలని.. రుషికొండలో CRZ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారాని కమిటీ ఇప్పటికే తేల్చిందన్నారు. పరిహారాన్ని అధికారుల దగ్గరి నుంచి రాబట్టాలన్నారు. కేరళలో నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చిందని స్పష్టం చేశారు. కాగా, శర్మ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Rushikonda
TDP : రుషికొండ ప్యాలెస్‌పై టీడీపీ జెండా.. సంబరాల్లో పార్టీ శ్రేణులు..!
Visakha : ఎన్నికల ఫలితాల్లో (Election Results) టీడీపీ కూటమి (TDP Alliance) ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రుషికొండ ప్యాలెస్‌పై పార్టీ జెండా ఎగుర వేశారు. కాగా, ఇప్పటి వరకు రుషికొండపై వైసీపీ (YCP) ప్రభుత్వం ఎవ్వరిని అనుమతించని విషయం తెలిసిందే.
Also Read : UP: దేశవ్యాప్తంగా తగ్గిన మోడీ క్రేజ్.. యూపీలో భారీ దెబ్బ!
MP Raghuram krishna raju: రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు: ఎంపీ రఘురామ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై, మంత్రులు రోజా, అమర్నాథ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘు రామకృష్ణ రాజు. రుషికొండపై జగన్ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధం లేకుండా.. అక్రమ నిర్మాణాలు చేపడుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెస్ట్ హౌస్ లను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతుల సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఎంపీ రఘురామ.
అలాగే పర్యాటకం ముసుగులో ముఖ్యమంత్రి ఇల్లు, వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయన్ని కడుతున్నారని విమర్శించారు. రుషి కొండలో కడుతున్న గెస్ట్ హౌస్ లను జగన్ దంపతులు సొంతం చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నిర్మాణాలను అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘురామ.
కాగా ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ లో చేసిన ట్వీట్ పై ఎంపీ రఘు రామకృష్ణ రాజు మాట్లాడుతూ.. రిషికొండ వద్ద అధికారిక భవనాలు కట్టుకుంటే తప్పేంటని ముందు ట్వీట్ చేశారు. ఆ తర్వాత మా పార్టీ మళ్లీ వెనక్కి తీసుకుంటూ.. ట్వీట్ ను డిలీట్ చేశారన్నారు. ప్రభుత్వ భూమిలో భవనాలు కడితే తప్పేంటని రోజా, అమర్నాథ్ లు అన్నారు.
ఆ ఇద్దరు మంత్రులకు కనీస పరిజ్ఞానం కూడా లేదు.. సీఆర్‌జెడ్ జోన్ లో కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయం ఆ మంత్రులకు తెలియదా? అని ప్రశ్నించారు. పర్యాటకానికి సంబంధం లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు.. సీఎం ఇల్లు, తాత్కాలికంగా ఉండేందుకు కార్యదర్శుల కోసం నిర్మిస్తున్నారని అన్నారు. రిషికొండ వద్ద నిర్మిస్తున్న నిర్మాణాలు.. అక్రమ కట్టడాలు అని వెల్లడించారు ఎంపీ రఘు రామ కృష్ణ రాజు.
పవన్ కళ్యాణ్ వీధి రౌడీలా మారిపోయాడు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రుషికొండ వద్ద పవన్ ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటరీ వ్యవస్థను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చడాన్ని ఖండించిన ఆయన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కంటే దండుపాళ్యం బ్యాచ్ ఇంకేముంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడుపోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుస్తకాలు అంటే తనకిష్టమని తాను ఎక్కువ సమయం పుస్తకాలు చదివేందుకే కేటాయిస్తానన్న పవన్.. వాటిలో జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేదని మంత్రి ఎద్దేవా చేశారు.
రుషికొండకు వెళ్లిన పవన్ పక్కనే ఉన్న గీతం కాలేజీకి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. గీతం కాలేజీని నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని, అది చంద్రబాబు బంధువుకు చెందిన కాలేజీ కాబట్టే పవన్ దాని గురించి మాట్లాడటం లేదన్నారు. జగదాంబ సెంటర్లో వాలంటీర్లను అన్నా తమ్ముళ్లతో పోల్చిన పవన్.. వారిని దండుపాళ్యం బ్యాచ్ అంటే ఆయన కూడా దండుపాళ్యం బ్యాచ్‌కు చెందిన వ్యక్తే అవుతారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ విషయాన్ని పవన్ ఒప్పుకున్నట్లైందని ఆరోపించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్‌కు కనీస పరిజ్ఞానం లేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో తెలుసా అని ఆయన పవన్‌ను ప్రశ్నించారు. పవన్ తన మాటలను వక్రీకరించారని, తాను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. నన్ను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరని ఎంపీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి తనను రాజీనామా చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు చెప్పింది చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ విశాఖను నాశనం చేయాలని చూస్తున్నారని ఎంపీ ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంపై అంతగా చెలరేగిపోతున్న పవన్ కళ్యాణ్ తానే సిఎం అభ్యర్థినని చంద్రబాబుతో చెప్పించాలని ఎంవీవీ సత్యనారాయణ సవాల్ విసిరారు. పవన్ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ నాయకుడి లక్షణం ఒక్కటి కూడా లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో గంతులేస్తే నాయకులు కాలేరన్న ఎంపీ.. ప్రస్తుతం వీధి రౌడీకి, పవన్‌కు ఎలాంటి తేడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వీధి రౌడీ రానున్న ఎన్నికల్లో సైతం గెలవలేడని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ధ్వజమెత్తారు.
Varudu kalyani: పవన్‌కు రుషికొండపై పనేంటి.?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు రుషికొండ మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందో అర్థం కావడంలేదన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చిన ప్రతి సారి రుషికొండకు వెళ్తున్నారన్న ఆమె.. ఆయనకు రుషికొండపై పనేంటని ప్రశ్నించారు. రుషికొండకు ఎదురుగా లోకేష్ బంధువుకు చెందిన గీతం యూనివర్సిటీ ఉందన్న ఎమ్మెల్సీ.. పవన్ అక్కడికి ఎందుకు వెళ్లడం లేదన్నారు. కొండను తోడేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్.. కొండమీదే ఉన్న వేంకటేశ్వర స్వామి గుడి గురించి కానీ, రామానాయుడు స్టూడియో గురించి కానీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతోందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్చుకోలేదన్న ఆమె.. ఓనమాలు నేర్చుకునేందుకే ఆయన విశాఖ వస్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ నగరానికి వస్తున్న జనసేన అధినేతకు నగరం అభివృద్ధి చెందడం మాత్రం ఇష్టంలేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పవన్ సీఎం జగన్‌పై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు భద్రత పెరిగిందన్నారు. సీఎం జగన్ మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. మహిళలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో భద్రత ఉందన్నారు.
విశాఖను సీఎం జగన్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు. రానున్న రోజుల్లో విశాఖ నగరం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందుతుందని వరుదు కళ్యాణి జోస్యం చెప్పారు. జగన్ సిటీని అభివృద్ధి చేస్తే.. ప్రజలు తమను పట్టించుకోరనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ నగరం అభివృద్ధి చెందకూడదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్సీ.. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టి హింసను సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ హింసను సృష్టించాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్సీ హెచ్చరించారు. పోలీసుల అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ నగరానికి వచ్చి తప్పు చేశారని వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మరో తప్పు జరుగకుండా జనసేన పార్టీ కార్యకర్తలను, తన అభిమానులను కంట్రోల్ చేయాలని సూచించారు. లేకపోతే నగరంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్నారు.