Amazon AI assistant Rufus: అమెజాన్ షాపింగ్ మార్కెట్ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. మొత్తం ప్రపంచం అంతా దీని మీద ఆధారపడి బతుకుతోంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపుగా అన్ని వస్తువులూ దొరుకుతున్నాయి. ఎప్పటికప్పుడు తన సేవలను మెరుగు పర్చుకుంటూ వస్తున్న అమెజాన్ ఇప్పుడు ఏఐ రంగంలోకి కూడా దిగింది. తమ కస్టమర్ సర్వీస్ కేర్‌లో ఏఐ రూఫస్‌ను ప్రవేశపెట్టింది. అమెజాన్ తన AI అసిస్టెంట్ రూఫస్ యొక్క బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఆరు నెలల క్రితం మొదట దీన్ని అమెరికాలో విడుదల చేసింది అమెజాన్. అక్కడ సక్సెస్ అవడంతో ఇప్పుడు దీన్ని భారత్‌లో కూడా రిలీజ్ చేసింది.
అమెజాన్ ఏఐ రూఫస్..యాప్‌లో షాపింగ్ చేయడానికి సహాయం చేస్తుంది. కొనుగోలు దారులతో సంభాషస్తూ వారి అవసరాలు, ఉత్పత్తులకు దారి చూపిస్తుంది. కస్టమర్ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేలా రూఫస్‌ను తయారు చేశారు. అంతేకాదు ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు ఎలాంటివి కొనాలి…ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి లాంటి క్వశ్చన్లను కూడా రూఫస్‌ను అడగవచ్చును. ఈ ఏఐ టూల్ అమెజాన్ మొబైల్ యాప్‌లలో ఇక మీదట వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. యాప్‌లో ప్రధన నావిగేటింగ్ బార్‌కు కిందన కనిపిస్తుంది. స్క్రీన్ మీదచాట్ డైలాగ్ బాస్‌లా కనిపిస్తుంది.
Also Read: Paris Para Olympics: పారిస్ లో మళ్ళీ ఒలింపిక్స్ సందడి..అట్టహాసంగా పారా ఒలిపింక్స్ వేడుకలు