Indonesia Volcanic Eruption: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. దీని నుంచి లావా ఉప్పొంగి ఏరులై పారుతోంది. ఈ లావా కిలోమీటర్ల మేర వ్యాపిస్తోంది. ఇండోనేషియాకు ఉత్తరం వైపు ఉన్న స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. గడిచిన 24 గంటల్లో ఇది ఏకంగా 5సార్లు బద్ధలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆదేశ జియోలాజికల్ ఏజెన్సీ ధృవీకరించింది. దీంతో అక్కడ దగ్గరలో ఉన్న ప్రజల చేత ఇళ్ళు ఖాళీ చేయిస్తున్నారు. వారిని అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిపర్వతం నుండి వెలబడుతున్న పొగ, బూడిద సమీప ప్రాంతాలను కమ్మేసిందని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. రుయాంగ్ అగ్నిపర్వతం సుమారు 725 మీటర్ల పొడవు ఉంటుంది.
— dikdik (@DikySitepu) April 17, 2024
సునామీ హెచ్చరికలు…
ఇప్పుడు ఈ అగ్ని పర్వతం బద్ధలైపోవడంతో పాటూ మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. విస్ఫోటన్ కారణంగా అగ్ని పర్వతంలో కొంత భాగం సముద్రంలోకి కూలిపోయింది. దీనివలన సునామీ వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇండోనేషియా ప్రజలను హెచ్చరిస్తున్నారు. సముద్రానికి దగ్గరలో ఉన్న దాదాపు 11 వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇండోనేషియాలో అగ్ని పర్వతాలు బద్ధలవడం చాలా సాధారణమే అయినప్పటికీ…ఇప్పుడు సునామీ భయం కూడా ఉండడంతో అక్కడి ప్రభుత్వం, అధికారులు అలెర్ట్ అవుతున్నారు.
Also Read: Kerala: కేరళలో మాక్ పోలింగ్ ఆరోపణల మీద స్పందించిన సుప్రీంకోర్టు..తనిఖీ చేయాలని ఆదేశం