Anchor Swapna Chowdary Vs Tammali Raju: రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) 7 సీజన్ వ్యవహారంలో మొదలైన స్వప్నా చౌదరి (Swapna Chowdary), తమ్మలి రాజు (Tammili Raju) గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సీజన్ లో తనకు అవకాశం ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసి తమ్మలి రాజు అనే వ్యక్తి తనను దారుణంగా మోసం చేశాడంటూ స్వప్నా చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ఇదే గొడవపై ఆర్టీవీ లైవ్ ప్రాగ్రామ్ లో పాల్గొన్న వీరిద్దరూ అందరు చూస్తుండగానే మాటల తూటాలు పేల్చుకున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ విచక్షణ కోల్పోయి దాడులు చేసుకునేంతగా రెచ్చిపోయారు.
సత్యతో తమ్మలి రాజు పరిచయం..
ఈ మేరకు స్వప్న మాట్లాడుతూ.. నేను యాంకర్, నటిగా ఎంతో కష్టపడి సొంతంగానే ఎదిగానని చెప్పింది. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొని అందరికీ సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నానని, ఈ క్రమంలో మొదట సత్య అనే వ్యక్తిని కలిస్తే సత్య.. తమ్మలి రాజు అనే వ్యక్తిని పరిచయం చేశాడని తెలిపింది.
ప్రొఫైల్ బాగుందని నమ్మించి..
ఈ క్రమంలోనే మీ ప్రొఫైల్ బాగుంది. ఆల్రెడీ మీ ప్రొఫైల్ ను బిగ్ బాస్ నిర్వాహకులకు పంపించాం. ఒక ఐదు లక్షలు రెడీ చేసుకోండి అని చెప్పారు. అయితే 5 లక్షలు ఎందుకు అని ప్రశ్నిస్తే.. పబ్లిక్ రిలేషన్స్, కాస్టూమ్స్ కోసం అన్నారు. పీఆర్ కావాలనుకుంటే మా ఫ్రెండ్ తల్లాడ సాయికృష్ణ ఉన్నాడని చెప్పాను.
ఇది కూడా చదవండి : DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ?
మొదట రూ.2.50 లక్షలు..
గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఇనాయా సుల్తానా, సూర్య, సత్యశ్రీలను తానే పంపించానని రాజు చెప్పాడు. సీజన్-7లో బోలే షావలీని పంపించింది కూడా తానే అని చెప్పాడు. ఒకవేళ బిగ్ బాస్ చాన్స్ రాకపోతే నీ డబ్బు నీకు తిరిగిచ్చేస్తామన్నారు. సత్యను నమ్మాను కాబట్టి, అతడు పరిచయం చేసిన తమ్మలి రాజును కూడా నమ్మాను. దాంతో మొదట రూ.2.50 లక్షలు ఇచ్చి నమ్మి మోసపోయానని స్వప్న చెప్పింది.
తిరిగి ఇస్తానంటున్న రాజు..
దీనిపై మాట్లాడిన తమ్మలి రాజు.. తన డబ్బులు తిరిగి ఇస్తానని అన్నాడు. అయితే ఈవిషయంపై కాసేపు వాదోపవాదనలు జరగగా.. ఇద్దరూ సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఒక దశలో కొట్టుకుంటారేమో అనేంతగా రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.