లాటరీ టికెట్ కొనుగోలు చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్ పాట్ కొట్టారు. కేరళ లాటరీ విభాగం ప్రకటించిన వర్షాకాల ఫలితాల్లో ఈ 11మంది మహిళలు కొనుగోలు చేసిన టికెట్ ఏకంగా రూ. 10కోట్లు గెలుచుకుంది. కేరళలోని పరప్పనంగడి మునిసిపాలిటీలో హరిత కర్మ సేనకు చెందిన 11 మంది మహిళా కార్మికులు ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంటారు. వీరంతా కలిసి రూ. 25కంటే తక్కువగా పోగేసుకున్నారు. మొత్తం రూ. 250 జమకాగానే ఇటీవలే కేరళ లాటరీ టికెట్ కొన్నారు. కానీ ఈ లాటరీ టికెట్ రూ. 10 కోట్ల రూపాయల విలువైన జాక్పాట్ కొడుతుందని…కలలో కూడా ఊహించలేదు.
బుధవారం ప్రకటించిన ఫలితాల్లో హరిత కర్మ సేన కొనుగోలు చేసిన టికెల్ రూ. 10కోట్ల జాక్ పాట్ కొట్టింది. ఈ వార్త తెలియగానే ఆ కార్మికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. గతేడాది కూడా ఓనమ్ పండుగ సందర్బంగా తలాకొంత పోగేసికొనుకున్నారు. ఆ టికెట్ కు రూ. 7,500వచ్చాయి. దీంతో అందరూ సమానం పంచుకుకున్నారు. అదే ధైర్యంతో ఈసారి కూడా మరో టికెట్ కొన్నారు. కానీ రూ. 10కోట్లు వస్తాయని వాళ్లంతా ఊహించలేదు. ఈ డబ్బును అందరం సమానంగా పంచుకుంటామని చెబుతున్నారు. కొంతమంది అప్పులు తీర్చుకుంటామని..ఇంకొందరు పిల్లల పెళ్లిళ్లు చేస్తామని..వైద్యం చేయించుకుంటామని అంటున్నారు.
అంతేకాదు 2022లో ఓనం బంపర్ లాటరీలో కేరళకుచెందిన ఓ వ్యక్తి రూ. 25కోట్ల జాక్ పాట్ కొట్టాడు. శ్రీవరాహంకు చెందిన అనూప్ తొడుపజలోని మనక్కడ్ జంక్షన్ వద్ద లాటరీ స్టోర్ ప్రారంభించాడు. లాటరీ తన జీవితంలో ఎన్నడూ చూడని డబ్బును తీసుకువచ్చిందని..అందుకే తాను లాటరీ టికెట్లు విక్రయించే బిజినెస్ ప్రారంభించాలని కోరుకున్నట్లు చెప్పాడు. అనూప్ ఆటోను తోలుతూ కుటుంబాన్ని పోషించేవాడు. లాటరీ తగిలిన తర్వాత తన ఆటోను తన తమ్ముడికి అప్పగించాడు. ట్యాక్సీలన్నీ పోగా అనూప్ కు రూ. 12కోట్లు మిగిలాయి.
కోట్లు కురిపిస్తున్న లాటరీ టికెట్ మనమూ కొనుగోలు చేయవచ్చా?
కేరళలో లాటరీ రెగ్యులేషన్ చట్టం ప్రకారం..కేరళ వెలుపల ఈ లాటరీ టికెట్లను విక్రయించడం నిషేధం. అయితే ఇతర రాష్ట్రాల ప్రజలు కేరళకు వచ్చి లాటరీ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ప్రైజ్ మనీ గెలుచుకుంటే సంబంధిత డాక్యుమెంట్లు చూపించి డబ్బును పొందవచ్చు.
కేరళ సర్కార్ ఎలాంటి లాటరీలు విక్రయిస్తోంది?
కేరళలో వారంలో ప్రతిరోజూ లాటరీ ఉంటాయి.
సోమవారం-అక్షయ,
మంగళవారం-కారుణ్య
బుధవారం-కారుణ్య ప్లస్
గురువారం-నిర్మల్
శుక్రవారం-స్త్రీశక్తి
శనివారం-విన్ విన్
ఆదివారం -ఫిఫ్టి ఫిఫ్టి
ఈ పేర్లతో ప్రతిరోజూ డ్రాలు నిర్వహిస్తారు. 50:50లాటరీ గెలిచినవారికి కోటిరూపాయలు ఇస్తారు. రోజువారీ లాటరీలలో అధిక ఫ్రైజ్ మనీ ఉన్నది ఈ టికెట్టుకే. వీటికి అదనంగా ఏడాదికి ఆరు బంపర్ లాటరీలు కూడా ఉంటాయి. బంపర్ లాటరీల్లో భారీ మొత్తంలో క్యాష్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. మాన్ సూన్, పూజా, తిరువోనం, విశు, క్రిస్మస్ న్యూఇయర్ బంపర్ ఆఫర్ పేర్లతో ఈ లాటరీలు ఉంటాయి.