Real Estate Fight : హైదరాబాద్ (Hyderabad) దుండిగల్ పీఎస్ పరిధిలో రియల్ ఎస్టేట్ గొడవ చోటుచేసుకుంది. రౌడీ మూకలు (Rowdy Gang) రెచ్చిపోయి ప్రవర్తించారు. బౌరంపేట్‌లో భూ ఆక్రమణకు యత్నించారు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులపై కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. చివరికి దారుణం..
లాండ్మార్క్ ఫైవ్ (Landmark Five) పేరుతో ఆ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారు. అయితే, ఆ స్థలంలోకి మహేందర్ అనే వ్యక్తి రౌడీమూకలతో వచ్చి బీభత్సం సృష్టించాడు. భూ కబ్జా కోసమే దాడి చేశారంటున్నారు కాంట్రాక్టర్ సురేష్ (Contractor Suresh). గాయాలతో పీఎస్‌కు వెళ్లిన బాధితులు రౌడీ మూకపై ఫిర్యాదు చేశారు. అయితే, బాధితుల ఆరోపణలపై అధికారులు కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తోంది.