రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా వచ్చిన ‘యానిమల్’ నుంచి రొమాంటిక్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. డిసెంబర్ డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం బిగ్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సందీప్ వంగా మరోసారి తన మార్క్ చూపించగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.
అయితే ఈ సినిమాలో బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా ఒకే ఒక్క బోల్ట్ సీన్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే ముఖ్యంగా టోటల్ న్యూడ్ గా నటించిన ‘ఎవరెవరో’ అనే సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలివగా మేకర్స్ ఈ పాటను తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరో రణ్‌బీర్ కపూర్, బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. రణ్‌బీర్, తృప్తి మధ్య కెమెస్ట్రీ అదిరిపోవడంతో ఎవరెవరో వీడియో సాంగ్ ఎప్పుడు తీసుకొస్తారంటూ కొందరు నెటిజన్లు యానిమల్ యూనిట్‌ను ప్రశ్నించారు. ఈ పాటను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను యూనిట్ తీసుకొచ్చింది. ఎవరెవరో వీడియో సాంగ్ హిందీ, తమిళం, కన్నడ మలయాళం భాషల్లోనూ రిలీజ్ అయింది. యానిమల్ సినిమాలో ఎవరెవరో పాటకు విశాల్ మిశ్రా స్వరాలు అందించటంతో పాటు ఆయనే పాడారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మెలోడియస్గా ఉన్న ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఇక, రణ్‌బీర్, తృప్తి కెమిస్ట్రీ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
ఇది కూడా చదవండి : తల్లే సూత్రధారి.. నిజమాబాద్ ఫ్యామిలీ మర్డర్లపై సంచలన విషయాలు వెల్లడించిన ఎస్పీ
ఇక బాబీ డియోల్, అనిల్ కపూర్, శక్తి కపూర్, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్రలు పోషించిన సినిమా.. ఇప్పటివరకూ 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.830కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.