Anchor Suma Kanakala : బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ బిజీబిజీగా గడిపే ఈమె.. తాజాగా ‘రాకీ అవేన్యూ’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వివాదంలో చిక్కుకున్నారు. సుమ ప్రమోట్ చేసిన ఈ కంపెనీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసిన కొంతమంది తమ డబ్బులు తిరిగి పొందలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే…
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ.. మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పింది. అపార్ట్మెంట్స్ కట్టి ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే పలువురు ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టారు. అలా రూ.88 కోట్ల మొత్తంతో సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Also Read : ‘కాంతారా’ హీరో ఎమోషనల్ పోస్ట్.. 24 ఏళ్ళ కల నిజమైందంటూ!
కాగా సుమ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ, ప్రాజెక్టులను ప్రమోట్ చేశారు.ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ప్లేట్ ఫిరాయించడంతో యాంకర్ సుమపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ యాడ్లో సుమతో పాటు ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాల కూడా నటించడంతో బాధితులు.. సుమ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదంపై యాంకర్ సుమ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Thank you so much for your love and support.. pic.twitter.com/A5W5VwJly2
— Suma Kanakala (@ItsSumaKanakala) August 7, 2024
అందులో..” రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు నేను ప్రమోట్ చేసిన మాట వాస్తవమే. కానీ అది 2016 – 2018 మధ్య కాలంలో మాత్రమే. ప్రస్తుతం సంస్థతో నాకెలాంటి సంబంధం లేదు. అయినా కూడా నేను ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయ్సత్నిస్తున్నా. అందులో భాగంగానే మరియు సంబంధిత పక్షాలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. ఇటీవలి కాలంలో నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుండి కొన్ని లీగల్ నోటీసులను అందుకున్నాను. వారి నోటీసులకు రిప్లై కూడా ఇచ్చాను. అందులో రాకీ ఎవెన్యూలకు పంపిన లీగల్ నోటీసులో కొనుగోలుదారుల గ్రేడియెన్సులను కూడా పరిశీలించమని వారిని కోరాను” అంటూ పేర్కొన్నారు.