Road Kalyanam : పెళ్లంటే సాధారణంగా స్త్రీ, పురుషులు(Men & Women) లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే అందమైన వేడుక. అయితే కొంతమంది పెంపుడు జంతువులకు సైతం వివాహం జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొంతమంది వార్తల్లో నిలవడం కోసం చెట్లను, రైస్ కుక్కర్లను పెళ్లి చేసుకోవడం చూశాం. కానీ కేరళ(Kerala) లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఏకంగా రోడ్డుకే మ్యారేజ్(Road Marriage) చేశారు. పూలు, పండ్లు, స్వీట్స్, బిర్యానీ తదితర వెరైటీలతో అతిథులకు అదిరిపోయే విందు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.
‘రోడ్డుకు పెళ్లి’ పేరుతో..
అసలు విషయానికొస్తే.. కేరళ కోజికోడ్‌లోని కొడియాత్తూరు గ్రామస్థులు ‘రోడ్డుకు పెళ్లి’(Road Ku Pelli) పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొడియాత్తూరులో 1980లో నిర్మించిన 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు ఉంది. అయితే ప్రస్తుతం ఆ గ్రామ జనాభా 3 రెట్లు పెరిగింది. వాహన రాకపోకల రద్దీ పెరిగింది. గుంతలు పడిన రోడ్డుకు అనేకసార్లు మరమ్మతులు చేశారు. విస్తరణ పనుల కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినా అనేక కారణాలతో వాయిదాపడుతూ వస్తుంది.
ఇది కూడా చదవండి: AP:పవన్ మానసికస్థితి బాగోలేదు..నాకు బాధగా ఉంది: బాలకృష్ణ కామెంట్స్
రూ.లక్ష చొప్పున విరాళం..
ఈ క్రమంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేస్తే కొన్ని కుటుంబాలు భూమిని కోల్పోతాయని గుర్తించి ఒక వెరైటీ ఐడియా చేశారు. వారికి పరిహారం అందించడంతోపాటు, రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలు అవుతుందని లెక్కలేశారు. నిధుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టారు. అదే గ్రామంలో 15 మంది ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున రూ.15 లక్షల విరాళం అందించారు.
అయినా ఇంకా రూ.45 లక్షలు కావాల్సివుంది. దీంతో ‘పనం పయట్టు’ లేదా ‘కురికల్యాణం’ అనే సహకార సంస్థను సంప్రదించారు. ఉత్తర కేరళలో ఇది ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ. కాగా దీని పేరుతో కార్యక్రమాలు నిర్వహించి కావాల్సిన నిధులు సేకరిస్తారు. ఇందులో భాగంగానే కొడియాత్తూరు గ్రామస్థులు సైతం నిధుల కోసం ‘పనం పయట్టు’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించిన తమ చిరకాల కలను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=DM2SnB–q8Y