Ritu Chowdary Shocking Comments About Rave Party : టాలీవుడ్ లో ఇటీవల రేవ్ పార్టీ వ్యవహారం ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బెంగుళూరు ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీలో సినీ ఇండస్ట్రీ నుంచి నటి హేమా, ఆషి రాయ్ తదితరులు పాల్గొనడం.. నార్కోటిక్ టెస్టుల్లో వాళ్ళకి పాజిటివ్ రావడం ఇండస్ట్రీలోనే చర్చనీయాంశం అయింది.
అయితే తాజాగా మన జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి మాత్రం రేవ్ పార్టీకి ఎప్పుడెప్పుడు వెళదామా? తనను రేవ్ పార్టీకి ఎప్పుడెప్పుడు పిలుస్తారా? అని ఎంతో ఎదురుచూసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది.
Also Read : ‘బేబీ హీరోయిన్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందా?
రేవ్ పార్టీకి వెళ్లాలని ఉండేది..
జబర్దస్త్ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ మధ్య యాంకర్ గా బిజీ అవుతున్న ఈ హాట్ బ్యూటీ ఇటీవల ఓ ఈవెంట్ కి వెళ్ళింది. ఆ ఈవెంట్ లో తనకు రేవ్ పార్టీకి వెళ్లాలని ఉండదనే కోరికను బయటపెట్టింది.” రేవ్ పార్టీ అంటే ఏంటో ముందుగా నాకు తెలియదు..
అదేంటో తెలియక రేవ్ పార్టీకి నాకెప్పుడు ఆహ్వానం వస్తుందా? నన్నెప్పుడు పిలుస్తారా? అని ఆశగా ఎదురుచూశాను.
కానీ రేవ్ పార్టీల గురించి తెలిసిన తర్వాత వద్దని అనుకున్నా. ఇప్పటికీ రేవ్ పార్టీలపై పూర్తి అవగాహన లేదు. ఛానల్స్‌లో చూసి అంతో ఇంతో తెలుసుకున్నా. డ్రగ్స్ తీసుకుంటారని తెలిశాక రేవ్ పార్టీలు అవసరం లేదని ఫిక్సయ్యా. సినీ ఇండస్ట్రీలోని వాళ్లు డ్రగ్స్ తెలిసి తీసుకుంటున్నారో.. తెలియక తీసుకుంటున్నారో వాళ్లకే తెలియాలి” అంటూ చెప్పుకొచ్చింది.