Retail Inflation: జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.54 శాతానికి తగ్గింది. ఇది 59 నెలల కనిష్ట స్థాయి. ఆగస్టు 2019లో ద్రవ్యోల్బణం 3.21%. జూన్ నెలలో ద్రవ్యోల్బణం 5.08%. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బిఐ లక్ష్యం 2-4% పరిధిలో ఉంది. ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం 9.36% నుంచి 5.42%కి తగ్గింది. అదే సమయంలో, పట్టణ ద్రవ్యోల్బణం కూడా నెలవారీగా 4.39% నుండి 2.98%కి తగ్గింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 5.66% నుంచి 4.10%కి తగ్గింది.
2023 జూలైలో ఆహార ద్రవ్యోల్బణం 11.51%గా ఉంది, ఇప్పుడు అది 5.42%కి తగ్గింది. దాని ద్రవ్యోల్బణం నెలవారీగా 9.36% నుండి 5.42%కి తగ్గింది. ఒక సంవత్సరం క్రితం, జూలై 2023లో, ఆహార ద్రవ్యోల్బణం 11.51%. అంటే ఏడాది లెక్కలో చూసినా బాగా తగ్గిందని చెప్పవచ్చు. కూరగాయల ద్రవ్యోల్బణం జూలైలో 6.83% ఉండగా, జూన్‌లో రేటు 29.32%గా ఉంది. తృణధాన్యాలు .. పప్పులు భారతీయ ప్రధాన ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. దాని ద్రవ్యోల్బణం 8.14%కి తగ్గింది.
Retail Inflation: ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాను 4.5% వద్ద ఆర్బిఐ ఇటీవల నిర్వహించిన ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఉంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాను గతంలో ఉంచిన అంచలా వద్దే అంటే 4.5% వద్ద మార్చకుండా ఉంచింది. ద్రవ్యోల్బణంపై ఆర్బిఐ గవర్నర్ మాట్లాడుతూ – ద్రవ్యోల్బణం తగ్గుతోంది, అయితే పురోగతి నెమ్మదిగా.. అసమానంగా ఉంది. భారతదేశ ద్రవ్యోల్బణం .. వృద్ధి పథం సమతుల్య పద్ధతిలో ముందుకు సాగుతున్నాయి. అయితే, ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా అప్రమత్తంగా ఉండటం ముఖ్యం అని చెప్పారు.
ద్రవ్యోల్బణం ఎలా ప్రభావితం చేస్తుంది?
Retail Inflation: ద్రవ్యోల్బణం నేరుగా కొనుగోలు శక్తికి సంబంధించింది. ఉదాహరణకు, ద్రవ్యోల్బణం రేటు 6% అయితే, సంపాదించిన రూ. 100 విలువ కేవలం రూ.94 మాత్రమే ఉంటుంది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టుబడి పెట్టాలి. లేదంటే మీ డబ్బు విలువ తగ్గిపోతుంది.
ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుంది .. తగ్గుతుంది?
Retail Inflation: ద్రవ్యోల్బణం పెరుగుదల .. పతనం రెండూ ప్రోడక్ట్ డిమాండ్ .. సప్లై పై ఆధారపడి ఉంటాయి. ప్రజల వద్ద ఎక్కువ డబ్బు ఉంటే వారు ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే, ఈ వస్తువుల ధర పెరుగుతుంది.
ఈ విధంగా మార్కెట్ ద్రవ్యోల్బణానికి గురవుతుంది. కొంచెం అర్ధం అయ్యేలా చెప్పుకోవాలంటే.. మార్కెట్లోకి అధికంగా డబ్బు రావడం.. అలాగే వస్తువుల కొరత ద్రవ్యోల్బణానికి కారణం అవుతాయి. అయితే, డిమాండ్ తక్కువగా ఉండి సరఫరా ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది.
ద్రవ్యోల్బణం ఎవరు లెక్కిస్తారు?
మనమందరం రిటైల్ మార్కెట్ నుండి వస్తువులను కొనుగోలు చేస్తాము. దీనికి సంబంధించిన ధరలలో మార్పులను చూపించే పనిని వినియోగదారు ధర సూచిక అంటే CPI చేస్తుంది. వస్తువులు వివిధ సర్వీసులకు మనం చెల్లించే సగటు ధరను CPI కొలుస్తుంది. ముడి చమురు, కమోడిటీ ధరలు, తయారీ ఖర్చులు కాకుండా, రిటైల్ ద్రవ్యోల్బణ రేటును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అనేక అంశాలు ఉంటాయి. రిటైల్ ద్రవ్యోల్బణం రేటును నిర్ణయించే ధరల ఆధారంగా దాదాపు 300 వస్తువులు ఉన్నాయి.