Winter Health Tips: చలిలో తీవ్రత పెరుగుతుంది. వాతావరణం వణికిస్తోంది. పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ కాలంలో జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. ఉదయాన్నే లేచి వాకింగ్ (walking) జాగింగ్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా వ్రుద్ధులు, చిన్నిపిల్లలు, గర్బిణీలు, బాలింతలు ఈ కాలంలో వాకింగ్ కానీ లేదా జాగింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. నానాటికి పెరుగుతున్న చలి తీవ్రతతో శ్వాసకోశ వ్యాధులు(Respiratory diseases) ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చలికాలంలో వ్రుద్ధులు చిన్నారులు బయటకు రాయకపోవడంమే మంచిదని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరైతేనే తలకు మఫ్లర్ లేదా మంకీ టోపీలు, ముఖానికి మాస్కులుధరించి బయటక రావడం మంచిదని చెబుతున్నారు. దీంతోపాటు వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ముఖ్యం. పరిసరాల శుభ్రత చాలా ముఖ్యం లేదంటే దోమలు వ్యాపించి టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యా, మెదడు వాపు, వంటి విషజ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కుంగా ఉంటుంది.
తాగునీటి విషయంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కలుషిత నీరు తాగితే డయేరియా వ్యాపించే ప్రమాదకం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. గాలి ద్వారా స్వైన్ ఫ్లూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా సోకే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మనిషిలో రోగనిరోధకశక్తి తక్కవగా ఉన్నవారికి ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని..పౌష్టికాహారం ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చలికాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవే:
చలికాలంలో ప్రతిఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. చిన్నారులు, వ్రుద్ధులు, ఆస్తమా రోగులు, చల్లగాలిలో మంచుపట్టిన సమయంలో బయటకు రావడం మంచిదికాదు. ముఖ్యంగా చలికాలంలో ఏసీలు, ఫ్యాన్స్ , కూలర్లు వాడటం తగ్గించాలి. చర్మంలో అశ్రద్ధ వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో బయటకు తిరిగితే జలుబు, జ్వరం, ఫ్లూ వంటి వ్యాధులు సోకితే ఆరోగ్యం పాడవుతుంది. వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: షుగర్ ఉన్న వారు తప్పక తినాల్సిన 5 కూరగాయలు ఇవే!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
-చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన సమయంలో సొంత వైద్యానికి దూరంగా ఉండాలి.
– వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు తీసుకోవాలి.
-గోరువెచ్చని నీరు, వేడి వేడి ఆహారం తీసుకోవాలి.
-చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు కడిగిన తర్వాతే తినాలి.
– కాళ్లు చేతులు గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
-శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.
-ఇంట్లో దోమతెరలను వాడటం మంచిది.
-చిన్నపిల్లలకు స్వెటర్లు వేయాలి.
-గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
-క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం మర్చిపోవద్దు.
-టూవీలర్లమీద వెళ్లేవారు స్కార్ప్, జర్కిన్, తలకు హెల్మెట్, మంకీ క్యాప్స్ , కాళ్లకు షూ, చేతులకు గ్లౌజులు ధరించడం మర్చిపోవద్దు.