Hero Vishal : తమిళ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల నెట్టింట వైరల్ అవుతున్న తన వీడియోపై స్పందించారు. ఒక అమ్మాయితో విదేశీ వీధుల్లో ఒకమ్మాయితో నడుచుకుంటూ వెళ్లిన ఆయన.. కెమెరా కంటపడగానే ముఖం కప్పేసుకుని అమ్మాయితో హోటల్ లోపలికి పరిగెత్తారు. అయితే ఇందుకు సంబంధించిన తతంగాన్ని మొత్తం ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అమ్మాయిలతో తిరుగుతున్నాడంటూ దారుణంగా విమర్శల చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన విశాల్.. ఎవరూ తప్పుగా భావించొద్దని కోరారు.
Sorry guys, I guess it’s time to reveal the truth about the recent video. Well well well, it’s half true in terms of location, yes I am in New York which is my regular retreat place with my cousins, which is a ritual of destressing myself every year after a super chaotic rest of…
— Vishal (@VishalKOfficial) December 27, 2023
న్యూయార్క్ వీధుల్లో (Newyork) ఓ అమ్మాయితో కలిసి నడుస్తూ కనిపించే ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వచ్చాయి. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే నేనే మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నా. నన్ను క్షమించండి. ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పే సమయం వచ్చింది. అందులో కొంచెం వాస్తవం.. కొంచెం ప్రాంక్. లొకేషన్ ప్రకారం అది న్యూయార్క్‌లో తీసిందే. నేను, మా కజిన్స్ తరచుగా అక్కడకు వెళ్లి సరదాగా గడుపుతుంటాం. ఒత్తిడికి లోనైనపుడు అక్కడికి వెళ్తుంటాను. ఏడాదంతా పడిన కష్టాన్ని మర్చిపోవడానికి న్యూయార్క్‌కు వెళ్తామని చెప్పారు.
View this post on Instagram
ఇది కూఆ చదవండి : Deep fake: డీప్ ఫేక్ కు బలైన మరోనటి.. చాలా వల్గర్‌గా చూపించిన కేటుగాళ్లు
అలాగే ఆ వీడియోలో నేను మొహం ఎందుకు దాచుకున్నానంటే.. అదొక ప్రాంక్. క్రిస్మస్ రోజు నాతో సరదాగా మా కజిన్స్ అందరూ ప్రాంక్ వీడియో చేశారు. నన్ను ఆటపట్టించడం కోసం చేశారంతే. అలా చేయాలని నాతో చెప్పి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికైనా దానిపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని ఆశిస్తున్నా. కొంతమంది ఆ వీడియో వీక్షించి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ నేను ఎవరినీ ద్వేషించాలని అనుకోవడం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.