Producer A.M. Ratnam: ప్రముఖ నిర్మాత, జనసేన పార్టీ (Janasena) పరిశీలకులు ఎ. ఎం. రత్నం RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పట్టం కట్టాలని నిర్ణయించారన్నారు.
Also Read: వారేవా.. వాలీబాల్ ఆట ఆదరగొట్టిన నారా బ్రహ్మణి.. వీడియో వైరల్..!
నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ లో సైతం కూటమి అభ్యర్థులకు ఎక్కువగా ఓట్లు పడ్డాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే..కూటమి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో సినిమా స్టూడియోల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.