Rashmika Mandanna Deepfake Video : ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు ఎలాంటి సెన్షేషన్ ని క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆ మధ్య రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఆయితే సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.
ప్రభుత్వం వీటిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్న సరే కొంతమంది ఏమాత్రం మారడం లేదు. ఇక తాజాగా రష్మిక మందన మరోసారి డీప్ ఫేక్ బారిన పడింది. తాజాగా ఆమె ఫేస్ ను మార్ఫింగ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దీన్ని చూసిన రష్మిక ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మరోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒరిజినల్ గా కొలంబియా మోడల్ అయిన డానియెలా విల్లరియల్ కి చెందింది. ఈమె ఓ జలపాతం దగ్గర బికినీలో ఓ రీల్ చేసింది. ఇదే రీల్ ని ఎడిట్ చేసి ఈ వీడియోని క్రియేట్ చేసారు. అందులో రష్మిక ఫేస్ వచ్చేలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The DAU analysed a video that apparently features actress #RashmikaMandanna and found it to be a #deepfake. Read our detailed report with expert analysis below: https://t.co/BJOC1VH3MD
— Deepfakes Analysis Unit (@dau_mca) May 28, 2024
అయితే దీనిపై రష్మిక ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా గత ఏడాది నవంబర్ లో రష్మిక డీప్ ఫేక్ బారిన పడింది. ఈ వీడియోని ఎడిట్ చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రష్మిక తర్వాత ఆలియా భట్, కత్రినా కైఫ్, కాజోల్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్స్ సైతం ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు.
View this post on Instagram