5 Year Old Girl Raped And Murdered in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఓ అయిదేళ్ల బాలిక కామాంధుడి చేతిలో బలైంది. అభం శుభం తెలియని పసిపాపకు మాయమాటలు చెప్పిన దుర్మార్గుడు.. నమ్మించి ఘోరం చేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, ఆ తర్వాత హతమార్చి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఇది కూడా చదవండి: Kavya Maran: కావ్య పాప సంతోషానికి హద్దుల్లేవ్..అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా నెట్టింట వైరల్..!
మాయమాటలు చెప్పి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 24న ఓ యువకుడు బవానా ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హతమార్చి మృతదేహాన్ని ఒక ఫ్యాక్టరీలో దాచిపెట్టాడు. స్థానికుల సమాచారంతో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. అయితే నిందితుడు ఆమెను ప్రలోభ పెట్టి తనతో తీసుకు వెళ్లాడని, ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు ఆధారంగా అనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.