స్టార్ నటుడు రణ్‌దీప్ హుడా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. కొంతకాలంగా ఆయన పెళ్లిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు ఓ ఇంటివాడుకాబోతున్నట్లు తెలిపారు. తన ప్రేమికురాలినే పెళ్లాడబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అంతేకాదు తన మ్యారేజ్ కు సంబంధించిన పూర్తి వివారాలు కూడా వెల్లడించగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. హుడా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ మేరకు ‘మహాభారతంలో మణిపుర్ యువరాణి చిత్రాంగదను అర్జునుడు ఎక్కడ వివాహం చేసుకున్నాడో.. అక్కడే మేము ఒక్కటి కాబోతున్నాం. ఈ నెల 29న ఇంఫాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో మా (రణ్‌దీప్ హుడా, లిన్ లైస్రామ్) పెళ్లి జరగనుంది. త్వరలోనే ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నాం. మా ప్రయాణానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం’ అని రణ్‌దీప్ హుడా ఇన్‌స్టాలో రాసుకోచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొన్నాళ్లుగా రణదీప్, లిన్ లు డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరి డేటింగ్‌పై ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరు తమ రిలేషన్ ఎక్కడా బయట పెట్టలేదు. 2022లో దీపావళి వేడుకల తరువాత ఈ జంట తమ బంధాన్ని బయటకు వెల్లడించింది. రణ్‌దీప్ వయస్సు 47 ఏళ్ల కాగా లిన్ ఆయన కంటే 10 ఏళ్లు చిన్నది కావడం విశేషం. కాగా మోడల్, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది లిన్ లైస్రామ్.
Also read : నువ్వు తప్పు చేస్తున్నావు.. స్టార్ నిర్మాతకు సముద్రఖని సీరియస్ వార్నింగ్
ఇక 2001లో ‘మాన్ సూన్’ వెడ్డింగ్ సినిమా ద్వారా బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రణ్‌దీప్ మోస్ట్ హ్యాండ్ సమ్, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈయన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన రణ్ దీప్.. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, జన్నత్ 2, జిస్మ్ 2, కాక్ టెయిల్ , కిక్, రసియా, హైవే, సర్బ్ జిత్ వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ చిత్రంలో నటిస్తున్నారు.