Coolie Movie : తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) – సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘కూలీ’. రజినీ కాంత్ 171వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ స్టెడెడ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఒక్కరి పాత్రను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే టాలీవుడ్ కింగ్ నాగార్జున, మంజుమల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ (Shruti Haasan) పాత్రలను పరిచయం చేయగా.. తాజాగా మరో స్టార్ కాస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఉపేంద్ర ఫస్ట్ లుక్
‘కూలీ’ నుంచి కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ఉపేంద్ర ‘కలీసా’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల కాగా.. అందులో రజినీ లుక్, యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి.
Kicked to have @nimmaupendra sir joining the cast of #Coolie as #Kaleesha💥💥
Welcome on board sir🔥🔥@rajinikanth sir @anirudhofficial @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @sunpictures @PraveenRaja_Off pic.twitter.com/qGpM48ihvm
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 1, 2024
ఇది ఇలా ఉంటే కన్నడ స్టార్ ఉపేంద్ర (Upendra) 2015లో సూపర్ హిట్ ‘ఉప్పి 2’ తర్వాత దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తీసుకొని ‘UI’ అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫిక్షనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ‘UI’ నుంచి విడుదలైన ఉపేంద్ర లుక్ సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. తల పై కొమ్ములు, చేతిలో కత్తితో సింహాసనం పై కూర్చొని కొత్త అవతార్ లో కనిపించాడు.
Also Read: Coolie Movie: రజినీకాంత్ ‘కూలీ’ లో కోలీవుడ్ ముద్దుగుమ్మ.. ఫస్ట్ లుక్ రిలీజ్ – Rtvlive.com