Animal: ఇటీవల విడుదలైన ‘యానిమల్’మూవీపై చర్చ నడుస్తూనే ఉంది. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక(Rashmika), త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో సందీప్ వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇందులో బోల్డ్ కంటెంట్ మితిమీరిందని, మహిళలను కూడా కించపరిచారంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై సినీ సెలబ్రిటీలు సైతం భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే భూమీ పెడ్నేకర్ మూవీని పొగిడేయగా తాజాగా మరో బోల్డ్ బ్యూటీ హ్యూమా ఖురేషి (Huma Qureshi) యానిమల్ సినిమాపై ప్రశంసలు కురిపించింది.
— Huma Qureshi (@humasqureshi) September 17, 2023
ఇది కూడా చదవండి : Kanpur: పూనమ్ పాండే దంపతులపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా!?
చూసినంతసేపు అదే ఫీలింగ్..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘నాకు సందీప్‌రెడ్డి రూపొందించిన ‘యానిమల్’ (Animal) లాంటి సినిమాల్లో నటించాలనుంది. ‘ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’, లేదా భారీ యాక్షన్ చిత్రాలు చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ‘యానిమల్’ చూసినంతసేపు అలాగే అనిపించింది. నిజంగా ఇది భిన్నమైన చిత్రం. కథ, కథనం, సంగీతం అన్నీ నాకు బాగా నచ్చాయి. చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేశా. ఒక నటిగా ఇలాంటి కథలో నటించాలని కోరుకుంటున్నా. అయితే ఇలాంటి సినిమాలు చూడాలా? వొద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. వారు ఆదరించినంత కాలం సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రశంసలు, విమర్శలు సహజం. ఇప్పటికి ఎన్నో మంచి సినిమాలు విడుదలైన సమాజంలో ఎలాంటి మార్పులేదు’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.