Kalki Movie Artist Keya Nair Interview : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి2898AD’ లో ఆడియన్స్ ను ఆకట్టుకున్న పాత్రల్లో ‘రాయ’ రోల్ కూడా ఒకటి. ఆ పాప ట్రైలర్లో కూడా కనిపించింది. అశ్వత్థామ దగ్గర కనిపిస్తుంది. ‘నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా’, ‘మీ యుద్ధం మళ్లీ మొదలైనట్లు ఉంది’తో డైలాగులతో ఆకట్టుకుంది. సినిమాలో మంచి రోల్ ప్లే చేసింది. ట్రైలర్ చూసి చాలా మంది బాయ్ అనుకుంటారు కానీ.. ఆమె పాప. ఆమె పేరు కేయా నాయర్. సినిమా చూసిన వాళ్లంతా సోషల్ మీడియాలో ఆమెను తెగ హైలైట్ చేశారు.
Also Read : ‘NBK 109’ మూవీ షూటింగ్ లో ప్రమాదం.. గాయపడ్డ హీరోయిన్!
తాజాగా ఈ పాప ఆర్టీవి కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో కల్కి పార్ట్-2 గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇందులో భాగంగానే పార్ట్-2 లో కర్ణుడి రోల్ లో ప్రభాస్ కు సంబంధించిన ఓ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని పార్ట్ -2 పై ఒక్కసారిగా హైప్ పెంచేసింది. ఇంకా పార్ట్-2 గురించి మరెన్నో విశేషాలు పంచుకుంది. అవన్నీ తెలియాలంటే కింద ఉన్న ఫుల్ ఇంటర్వ్యూ చూడండి.