Prabhas Chatrapathi Movie Re-release date: రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియా శరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న (October 23) సినిమా విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాకు సంబంధించి బుకింగ్ లను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. పాన్ ఇండియా ప్రభాస్ బర్త్ డే (Prabhas Birthday) సందర్భంగా ఫ్యాన్స్ ను ఖుషి చేసేందుకు నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి. రాజమౌళి తీసిన ఈ సినిమా 2005లో ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ సినిమాను మరోసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయండంపై ఫ్యాన్స్ ఫులు ఖుషి అవుతున్నారు.
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న ఛత్రపతి మూవీ విడుదలకు రంగం సిద్ధం చేశారు. దీనిని 4కే వెర్షన్ లో తీసుకొస్తున్నారని తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి బుకింగ్ లను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. భాను ప్రియ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, జైప్రకాష్ రెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.
#Prabhas as Shivaji (Chatrapathi) #Chatrapathi4K
October 23rd on the occasion of #PrabhasBirthday #PrabhasBirthdayMonth pic.twitter.com/0aRnyATpf1
— ivd Prabhas (@ivdsai) October 18, 2023
Also Read: నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. త్వరలోనే రెండోపెళ్లి.. రేణూ దేశాయ్ కీలక ప్రకటన..