‘Kantara’ Hero Rishab Shetty Drives Prabhas Bujji : ప్రభాస్ ‘కల్కి’ సినిమా కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ వాహనానికి బుజ్జి అనే పేరు పెట్టి కథలో ఈ బుజ్జి చాలా కీలకమని తెలుపుతూ ప్రత్యేకంగా ఆ బుజ్జిని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ లో ప్రభాస్ ఆ వాహనాన్ని ఉపయోగించి చేసే ఫైట్ సీన్స్ సినిమాపై మరింత హైప్ పెంచేసాయి.
కాగా కల్కి ప్రమోషన్స్ లో భాగంగా బుజ్జిని దేశంలో ఉన్న పలు ప్రధాన నగరాల్లో తిప్పుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే నాగ చైతన్య, ఆనంద్ మహేంద్ర బుజ్జిని నడపగా.. తాజాగా ఈ లిస్ట్ లో మన ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి కూడా చేరిపోయాడు. కాంతార హీరో రిషబ్ శెట్టి తాజాగా బుజ్జి కారును నడిపారు. బుజ్జి కారును డ్రైవ్ చేసిన అనంతరం ఆ కారును ప్రశంసల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ టీమ్ ట్విటర్లో పంచుకుంది.
KALKI X KANTARA 🔥@shetty_rishab gets his hands on #Bujji.#Kalki2898AD pic.twitter.com/IvIHuxGO6y
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 24, 2024
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ నెల 27 న కల్కి వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. కేవలం గంటల వ్యవధిలోనే వేలల్లో టటికెట్స్ అమ్ముడవ్వడంతో ‘కల్కి’ కి భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ కోసం నిర్మాతలు సుమారు 700 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది.