Prabhas As British Soldier In Hanu Raghavapudi Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘కల్కి’ ప్రస్తుతం థియేటర్స్ లో దుమ్ములేపుతుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి డార్లింగ్ కు తిరుగులేని విజయాన్ని అందించింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రెజెంట్ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ మాత్రం తన తదుపరి సినిమాలకు సన్నద్ధం అవుతున్నాడు. కల్కి తర్వాత ప్రభాస్ చేయనున్న ప్రాజెక్ట్స్ హను రాఘవపూడి సినిమా కూడా ఒకటి.
ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దాని ప్రకారం పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ లవ్‌స్టోరీతో ఈ సినిమా ఉండబోతుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమా కథనం భారతదేశ స్వాతంత్య్రం పూర్వానికి ముందు జరుగుతుందని, బ్రిటిష్ సైన్యంలో పని చేసే సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : ఆడియన్స్ దెబ్బకు రన్ టైం తగ్గించిన మేకర్స్.. ఏకంగా అన్ని నిమిషాలా?
అంతేకాదు ఈ పాత్ర కోసం ప్రభాస్ స్పెషల్‌గా మేకోవర్ కానున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు మొదట్లో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందనున్న ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.