Actress Pooja Hegde Marriage : టాలీవుడ్ (Tollywood) లో చాలా స్పీడ్ గా స్టార్ ఇమేజ్ కైవసం చేసుకుంది పూజా హెగ్డే (Pooja Hegde). ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. అయితే గత రెండేళ్ల నుంచి ఈ హీరోయిన్ సినీ కెరీర్ డౌన్ లో ఉంది. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సౌత్ సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి. దాంతో బాలీవుడ్ కి వెళ్లి పలు అవకాశాలు అందుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి.
ఇటీవలే సల్మాన్ ఖాన్ (Salman Khan) తో పూజా హెగ్డే నటించిన ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. అయినా కూడా బాలీవుడ్ లో పూజా హెగ్డేకి ఆఫర్స్ తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు బీ టౌన్ లో తెగ చక్కర్లు కొడుకుతుంది. అదేంటంటే, పూజా హెగ్దే త్వరలోనే పెళ్లీ (Marriage) పీటలెక్కబోతుందట.
Also Read : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన బాలయ్య!
ఆ హీరోతో పెళ్లి…
బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రా (Rohan Mehra) తో పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ రోహన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. పలుమార్లు అతనితో కలిసి పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తూ మీడియా కంట పడింది. ఆ మధ్య పూజా హెగ్డే కారులో వెళ్తుండగా ఆమెతో పాటు రోహన్ మెహ్రా కూడా ఉన్నాడు.
ఇక తాజాగా వీరి ప్రేమకు పూజా హెగ్డే తల్లి దండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో బాలీవుడ్ (Bollywood) మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.