TDP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తరువాత 2014 లో అధికారం చేపట్టిన టీడీపీ పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే 2019 లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. ఆ సమయంలో అన్న క్యాంటీన్లను ఉంచాలని…వాటి వల్ల ప్రజలకు ఉపయోగమే తప్ప నష్టమేమి లేదని టీడీపీ నేతలు ఎంతగా చెప్పినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వాటిని రద్దు చేసింది.
అన్న క్యాంటీన్లు రద్దు చేయడంతో పేదవాడి కడుపు మీద కొట్టినట్లే అని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు తాజాగా 2024 ఎన్నికల ఫలితాల్లో ఏపీ లో మరోసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయిపోయింది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అన్న క్యాంటీన్లను కూడా తిరిగి ప్రారంభించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also read: వైఎస్సాఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసిన టీడీపీ కార్యకర్తలు!