Ganja: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి పినగాడి చెక్ పోస్ట్ వద్ద 20 కేజీల గంజాయిని అతిచాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. ముంచింగిపుట్టు నుంచి వరంగల్ తరలించేందుకు పాడేరు బస్సులో తీసుకొస్తున్న ఇద్దరు మహిళలతో పాటుగా 20 కేజీల గంజాయి, 49 వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నగర పరిధిలో 20 ర్యాండమ్ చెక్ పోస్టులు, అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకి సంభందించిన వివరాలను ఏసీపీ నర్సింహమూర్తి వివరించారు.