కాకినాడ జిల్లాలో పోలీసు అమరవీరులకు ఘననివాళి అర్పించింది కాకినాడ జిల్లా (Kakinada district) పోలీసుశాఖ. అమర వీరుల స్మృతి స్థూపం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి అమరులైన పోలీసులకు నివాళలార్పించారు. కాకినాడ జిల్లా కలక్టర్ (Collector), ఎస్పీ అంజలి ఘటించారు. ఈ కార్యక్రమాన్ని పాత పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అమర పోలీసు వీరుల స్మృతి స్థూపం దగ్గర నిర్వహించారు.
ఇది కూడా చదవండి: అమరవీరులకు ఆదిమూలపు నివాళులు…పాల్గొన్న పోలీస్ అధికారులు
ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, కాకినాడ అర్బన్ అండ్ రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (MLAs Dwarampudi Chandrasekhara Reddy), కురసాల కన్నబాబు (Kurasala Kannababu), పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు (Pithapuram MLA Pendem Dorababu), ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, స్మృతి పరేడ్‌నకు హాజరై అమర పోలీసులకు అంజలి ఘటించారు. స్మృతి పరేడ్‌కు వచ్చిన అమర వీరుల కుటుంబ సభ్యులను ఓదార్చి తామంతా అండగా వుంటామని భరోసానిచ్చి పండ్లు, నగదుతో పాటు వారికి కేటాయించిన ఇండ్ల స్థలాల పట్టాలను (Plots of house plots) అందించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలు..ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి కాషాయ కండువాలు
స్మృతి పరేడ్ (memorial parade)నకు పోలీసు అధికారులు, సిబ్బంది, ఉద్యోగ విరమణ (retired police officers)చేసిన పోలీసు అధికారులతో పాటు సిబ్బంది హాజరైయ్యారు. జిల్లా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల అధికారులతో పాటు సిబ్బంది అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. స్మృతి పరేడ్ ముగిసిన అనంతరం పోలీసు అమరవీరుల స్మృత్యర్థం చేసే ర్యాలీని కలెక్టరు, ఎస్పీ ఇతర ప్రజాప్రతినిధులు ( Representatives people) జెండా ఊపి ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేత దారుణ హత్య.. కాల్చిచంపిన మావోయిస్టులు