Virat Kohli – ICC Cricketer of the Year: ఐసీసీ నిన్న వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అనౌన్స్ చేసింది. ఎక్స్ లో దీన్ని ప్రకటించింది. ఈ వార్డును 2023 ఏడాదికి గానూ కింగ్ కోహ్లీని వరించింది. శుభ్‌మన్‌గిల్, షమీల నుంచి విరాట్‌కు గట్టి పోటీ ఎదురయింది కానీ చివరకు అతనే విజేతగా నిలిచాడు. దీంతో ఐసీసీ వన్టే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డును అత్యంత ఎక్కువ సార్లు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డ్‌ను సృష్టించాడు. 2012, 2017, 2018, 2023లలో కోహ్లీ అ వార్డును దక్కించుకున్నాడు.
Also Read:ఎలా స్పందించాలో తెలియడం లేదు..పద్మవిభూషణ్‌పై చిరంజీవి
2023ల6 విరాట్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 27 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 24 ఇన్నింగ్స్‌లలో 1, 337 పరుగులు చేశాడు. బౌలర్‌గా ఒక వికెట్ తీయడంతో పాటూ 12 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో 11 ఇన్నింగ్స్‌లలో 765 పరుగులు చేసిన మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. మరోవైపు విరాట్ కాతాలో ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. ఇందులో విరాట్‌ను ఇప్పటప్పటిలో ఎవరూ అందుకోలేరు కూడా. ఇప్పటివరకు అత్యధిక ఐసీసీ అవార్డులు (ICC Awards) అందుకున్న క్రికెటర్ల జాబితాలో కుమార సంగక్కర(4), ఎంఎస్ ధోనీ(4) ఉన్నారు.
Player of the tournament at the ICC Men’s @cricketworldcup 2023 😎
The extraordinary India batter has been awarded the ICC Men’s ODI Cricketer of the Year 💥 https://t.co/Ea4KJZMImE
— ICC (@ICC) January 25, 2024
కింగ్ కోహ్లీ…ఊరకనే ఈ బిరుదు రాలేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచీ తన బ్యాటింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఇంటా, బయటా అంతా తనదైన ఆటతో చెలరేగిపోతున్నాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేదు….ఎవరైనా చితక్కొట్టుడే. కోహ్లీ తన కెరీర్లో సాధించనిది అంటూ ఏం లేదు. 5 బీసీసీఐ అవార్డులు (BCCI Awards), ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్‌ను మూడు సార్లు, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును 12 సార్లు అందుకున్నాడు. 50 వన్డే సెంచురీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఓ వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డ్ కొట్టాడు. ఇలా మొత్తం రికార్డ్లన్నీ కవర్ చేసేసావు. ప్రస్తుతం కోహ్లీ ముందున్న ది ఒక్కటే ఒక్క సవాల్. అదే సచిన్ పేరు మీదున్న 100 సెంచరీల రికార్డ్. అది కూడా సాధించేస్తే విరాట్‌ను అందుకోవడం ఎవరి తరమూ కాదు. ప్రస్తుతం సూపర్ ఫిట్‌గా, మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీకి ఇదేమంత పెద్ద కష్టం కాదు కూడా. అతను రిటైర్ అయ్యేలోపు దానిని కూడా తన సొంతం చేసేసుకుంటాడు.