వరల్డ్ కప్ లో ఇండియా అద్భుత ప్రదర్శన చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఏదో ఒక అలిగేషన్ వేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు బాల్ ట్యాంపరింగ్ అంటూ గోల పెట్టారు. ఇప్పుడేమో పిచ్ లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. నిన్న జరిగిన ఇండియా-న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ ముందు భారత్ కు అనుకూలంగా పిచ్ ను మార్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇండియా గెలవడం కోసం పిచ్ లను మారుస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు.
ముంబయ్ లో జరిగిన సెమీ ఫైనల్స్ కోసం అగ్రిమెంట్ జరిగిందని…ఈ మ్యాచ్ కోసం ఫ్రెష్ పిచ్ ఉపయోగించారని అంటున్నారు. దీని వలన బాల్ మరింత బౌన్స్ అయిందని ఆరోపిస్తూ బ్రిటీష్ పేపర్ డెయిలీ మెయిల్ లో వ్యాసం వచ్చింది. అది కూడా బీసీసీఐ, ఇండియా హెడ్ కోచ్ కలిసి నిర్ణయం తీసుకురని..ఐసీసీకి అసలు ఇన్ఫామ్ కూడా చేయలేదని అభాండాలు వేస్తున్నారు. ముందంతా పిచ్ 7 మీద ఆడతారు అని చెప్పి లాస్ట్ లో పిచ్ 6 మీద ఎందుకు ఆడించారని ప్రశ్నిస్తున్నారు.
Also read:వీళ్ళు లేకపోతే అసలు మ్యాచ్ గెలిచేవాళ్ళమే కాదు..
అయితే ఈ ఆరోపణలను ఐసీసీ కొట్టిపడేసింది. స్వతంత్ర సలహాదారు ఆండీ అట్కిన్సన్కు సమాచారం ఇచ్చిన తర్వాతే పిచ్ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. పెద్ద పెద్ద టోర్నీల్లో పిచ్ లు మార్చడం చాలా సాధారణం అని చెప్పింది. ఐసీసీ మ్యాచ్ నిర్వహణ నిబంధనల ప్రకారం పిచ్ ఎంపిక, తయారీ బాధ్యత ఆతిథ్య సంఘానిదే. నాకౌట్ మ్యాచ్‌ను కొత్త పిచ్‌పైనే ఆడించాల్సిన అవసరం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.
మరోవైపు పిచ్ గురించి నాన్సెన్స్ మాట్లాడ్డం ఆపేయండి అంటూ మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. వాళ్ళు చెప్పిందే నిజమైతే నిన్నటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించాలి, కానీ అలా జరగలేదు కదా అని ఆయన అన్నారు. ఇక పిచ్ గురించి ఆరోపణలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సైతం కొట్టిపడేశాడు. పిచ్ విషయంలో మాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. రెండు జట్లకూ అనుకూలంగానే ఉంది అని చెప్పాడు కేన్. టీమ్ ఇండియా పరిస్థితులకు తగ్గట్టు తమ ఆటతీరు మార్చుకున్నారు. గత ఓటముల నుంచ పాఠాలు నేర్చుకుని వారు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకుపోతున్నారని కేన్ మెచ్చుకున్నాడు. ముంబై పిచ్ చాలా బాగుంది…దాని గురించి మాట్లాడక్కర్లేదు అంటూ కూల్ గా సమాధానం ఇచ్చాడు.