Free Tomatoes: టమాటా.. ఇది వరకు ఆ టమాటాలది ఏముందిలే అన్న వాళ్లు కాస్తా…ఇప్పుడు టమాటాలను బంగారం కంటే భద్రంగా దాచుకుంటున్నారు. చాలా మంది కొనుగోలుదారులైతే అసలు టమాటా మోహం కూడా చూడటం లేదు. టమాటాలకు ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతున్నారే తప్ప వాటి ఊసే ఎత్తడం లేదు.
సబ్సిడీ మీద టమాటాలు అందజేస్తున్నారంటే..వాటి కోసం క్యూలు కట్టి మరీ ఎంత సమయమైనప్పటికీ వాటిని తీసుకునే వెళ్తున్నారు తప్ప వదిలిపెట్టేదే లేదంటూ చెబుతున్నారు. రికార్డు స్థాయి ధరలు నమోదు చేస్తున్న టమాటా దానిని పండించిన రైతులను రాత్రికి రాత్రే కోటీశ్వరులను, లక్షాధికారులను చేస్తుంది.
ఈ క్రమంలోనే వ్యాపారం బాగా సాగాని ఇతర వ్యాపారులకు కొత్త కొత్త ఆలోచనలు కూడా ఇస్తూ వారి వ్యాపారాలు కూడా మంచిగా జరిగేటట్లు చేస్తుంది. అందుకు నిదర్శనం ఈ కొత్తగూడెం(Kothagudem) ఫోటో గ్రాఫరే. నగరానికి చెందిన వేముల ఆనంద్ స్థానిక కలెక్టరేట్ సమీపంలో కొంతకాలంగా ఓ ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు.
అయితే కొంతకాలం క్రితం కలెక్టరేట్ పాల్వంచకు మారిపోయింది అప్పటి నుంచి ఫోటో స్టూడియో గిరాకీ బాగా తగ్గిపోయింది. దీంతో ఆనంద్ కొంతకాలం బాధపడ్డాడు. కొద్ది రోజుల క్రితం ఆనంద్ కు ఓ వినూత్నమైన ఆలోచన వచ్చింది.
ఐడియా రావడమే లేటు..దానిని అమలు చేసేశాడు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జనాలు ఎక్కువగా తిరిగే చోట పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. తన వద్ద ఫోటో తీయించుకుంటే కనుక వారికి ఉచితంగా టమాటాలు ఇస్తానని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నాడు. దాంతో బుధవారం ఒక్కరోజే అతని వద్ద సుమారు 32 మంది ఫోటోలు తీయించుకున్నారు.
తన వద్ద 100 రూపాయలు చెల్లించి పాస్‌పోర్టు సైజ్ ఫోటో దిగితే వారికి 8 కాపీలతో పాటు పావు కిలో టమాటాలు ఉచితంగా అందిస్తానని ఆనంద్ పేర్కొన్నాడు.
బుధవారం ఫోటోలు తీయించుకున్న 32 మందికి ఒక్కొక్కరికీ రూ.40 విలువ గల పావు కిలో టమాటాలు అందించినట్టు ఆనంద్ తెలిపారు. మరోవైపు టమాటా ఆంధ్రప్రదేశ్‌లో ఆల్‌టైం రికార్డులు నమోదు చేస్తున్నది. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్లో కిలో రూ.224 పలికింది.
Also Read: విశాఖ కానిస్టేబుల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం.. పోలీసుల అదుపులో భార్య శివజ్యోతి