Sirisha : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక(Telangana Assembly Elections) ల్లో సంచలనంగా మారిన బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష(Sirisha) కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఎలక్షన్ టైమ్(Election Time) లో ప్రధాన పార్టీలు, సీనియర్లైన ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన బర్రెలక్క ఓ ఇళ్లాలు కాబోతుంది. ప్రస్తుతం ఆమె ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్ అవుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
View this post on Instagram
ప్రజల మనసులు గెలుచుకుంది..
ఈ మేరకు కొల్లపూర్ వాసి అయిన శిరీష(Sirisha) బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక బర్లను కాసుకుంటున్నానంటూ సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయింది. ఇదే క్రమంలో ఊహించని ప్రజాధారణ లభించడంతో ఒక్కసారిగా శిరీష దృష్టి ఎన్నికల మీదకు మరలింది. పలువురు విద్యావంతులు ఆమెకు మద్ధతుగా నిలవడంతో స్వంతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి సత్తా చాటింది. పోటీలో గెలవలేకపోయినా 5 వేలకు పైగా ఓట్లు సాధించి ప్రజల మనసులు గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు!
View this post on Instagram
వేసవిలోనే పెళ్లి..
ఇదిలావుంటే.. ఎలక్షన్ టైమ్ లో బర్రెలక్క తండ్రి ఆమెకు పెళ్లి అయిందని, భర్తను వదిలేసి వచ్చిందంటూ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వరుడు ఎవరనే విషయం బయటపెట్టకపోగా ఈ వేసవిలోనే దగ్గర బంధువునే పెళ్లాడబోతుందని తెలుస్తోంది.