Jana Sena Agitation In Guntur : గుంటురులో జనసేన ఆందోళన: ఇప్పటికే రెండో విడతల యాత్రలో YCP నేతలపై విమర్శలు చేసిన పవన్ మూడో యాత్ర ప్రారంభంతో ఏపీలో కాకపుట్టిస్తోంది. పవన్ ఈసారి విశాఖ నుంచి ప్రారంభించి మాటల తూటాలు ఎలా పేల్చుతారోని టెన్షన్‌గా ఉంది. మరి ఈ సారి ఇంకెంత హీటెక్కిస్తారో వేచి చూడాలి. మరొవైపు గుంటూరు జిల్లాలో జనసేన ఆందోళన చేపట్టారు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా క్విట్ జగన్ ఏపీ అంటూ నినాదాలు చేశారు జనసేన నాయకులు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెరిగిపోయాయని.. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని వారు మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనతో అన్నివర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నా.. ఎవరు ఒక్క సాయం కూడా చేయటం లేదని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ విమర్శలు: వైసీపీ ప్రభుత్వ (YCP Govt) అక్రమ, అవినీతిని ప్రశ్నించేలా పోరాటం చేస్తామని బీజేపీ (BJP) ఓవైపు అంటూనే ఉంది . గ్రామాల వికాసానికి కేంద్రం కృషి చేస్తోంటే…. పంచాయతీల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడుతున్నాయి. రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ పెద్ద ఎత్తున కేంద్ర నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమల్లిస్తుందన్నారని.. రాష్ట్రంలోని ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఏపీలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరో వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా అన్నారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ ప్రచారాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పుని విషయం తెలిసిందే.
భూకబ్జాలపై: రేపటి నుంచి ఆగస్టు 19 వరకు మూడో విడత వారాహి యాత్ర జరుగనుంది. రేపటి వారాహి యాత్రకు సిద్ధమైన పవన్.. ఈరోజే విశాఖ చేరుకోనున్నారు. దీంట్లో భాగంగా రేపు జగదాంబ జంక్షన్లో సభ నిర్వహించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేశారు. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ విశాఖలో జరుగుతున్న భూకబ్జాలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనలు చేపడతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
వాలంటీర్ వ్యవస్థలపై వ్యాఖ్యలు: మరోవైపు వారాహి విజయ యాత్రకు సంబంధించి కమిటీలతో నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. యాత్రపై నేతలతో చర్చించిన ఆయన.. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాల గురించి కూడా పవన్ వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. మరి ఇక మూడో విడత వారాహి యాత్రలో పవన్ ఈ టాపిక్‌పై మరోసారి ఏపీలో కాకపుట్టించనున్నట్లుగా కనిపిస్తోంది. రెండో విడత యాత్రలో వాలంటీర్ వ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారాన్ని రేపాయి. ఆ వేడి ఇంకా తగ్గనే లేదు. ఈక్రమంలో విశాఖలో జరుగుతన్న భూ కబ్జాల గురించి పవన్ ఆరోపణలు చేస్తే ఇక ఈ హీట్ ఇంకెంత దూరంలో పోతుందో చూడాలి మరి.