Owaisi: ఒవైసీ బ్రదర్స్‌కు రిలీఫ్ లభించింది. విద్యాసంస్థల కూల్చివేతల విషయంలో తొందరపడొద్దని, నిబంధనలకు లోబడే కూల్చివేతలు ఉండాలని హైకోర్టు హైడ్రాకు తెలిపింది. అలాగే పల్లా, మర్రి కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. తమ విద్యాసంస్థల కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టుకు వెళ్లారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. కాలేజీలను కూల్చివేస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని.. విద్యా సంవత్సరం దెబ్బతింటుందని కోర్టును కోరారు పల్లా.
దీంతో కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని పేర్కొంది. ఫాతిమా కాలేజీకి కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫాతిమా కాలేజీ బఫర్ జోన్లో ఉందంటూ హైడ్రా నోటీసులు ఇచ్చిన సంగఠీ తెలిసిందే. మరోవైపు కాలేజీల కూల్చివేతపై ఆచితూచి వ్యవహరిస్తామని సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ చెప్పారు. దీంతో ఒవైసీ బ్రదర్స్‌కు ఊరట లభించే అవకాశం ఉంది.