2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలు సాధిస్తామని బీజేపీ చాలా నమ్మకంగా చెప్పింది. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఇప్పటికి బీజేపీ 295 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇండియా కూటమి 231 స్థానాల్లో…ఇతర పార్టీలు 22ంటిలోనూ ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ నమ్మకాన్ని భారత ప్రజలు తిప్పి కొట్టారు. దాంతో పాటూ నార్త్‌లో బీజేపీకి బలమైన స్థానాలు అయిన పదింటితో కూడా ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కొన్నింటిలో పూర్తిగా ఓడిపోయిన బీజేపీ మరికొన్నింటిలో చాలా కష్టం మీద నెగ్గుకొస్తోంది.
ఉత్తరప్రదేశ్…
ఇది దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం. రాజకీయంగా చాలా బలమైనది. 2019 బీజేపీ ఇక్కడ 62 సీట్లు గెలుచుకుంది. ఈసారి కూడా విజయం తమదే అని భావించింది. కానీ తారుమారు అయ్యాయి. ఇప్పటి వరకు యూపీలో సమాజ్‌వాద్‌పార్టీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 80 స్థానాలున్న ఈ రాష్టంలో సమాజ్ వాద్ పార్టీ 40 ఆధిక్యంలో ఉండగా..బీజేపీ 32 తో వెనుకంజలో ఉంది. దీన్ని బట్టి యూపీలో ఇండియా కూటమి అలయెన్స్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించనుందని తెలుస్తోంది.
బీహార్‌లో ఇదే పరిస్థితి..
బీజేపీకి కంచుకోటగా భావించే బీహార్ కూడా కాషాయ పార్టీకి ఆశించిన ఫలితాలు ఇచ్చేలా కనిపించడం లేదు.
రాజస్తాన్..
రాజసతాన్‌లో అంతర్గత కలహాలు ఆపార్టీ ఈ సారి ఎన్నికల్లో దెబ్బతీశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ 24 స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి 13 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇవి కాకుండా ఇతర పార్టీలు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
మహారాష్ట్ర…
మహారాష్ట్రలో ఎన్డీయే ఓటమి పాలైంది. ఇక్కడ శివసేన, ఎన్సీపీల మధ్య విధ్వంసం కారణంగా ప్రజల మనసు బీజేపీ వైపు వెళుతుందని అనుకుననారు కానీ అదేమీ జరగలేదు. ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్ధులు తమ విజయ పతాకను ఎగురవేశారు.
హర్యానా..
మరోవైపు హర్యానాలోనూ బీజేపీ మ్యాజిక్పని చేయలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 10 స్థానాలను గెలుచుకున్న బీజేపీ 2024లో మాత్రం చాలా కష్టంగా పోరాడుతోంది. ఇక్కడ పది స్థానాల్లో బీజేపీ 5, కాంగ్రెస్ 5 స్థానాల్లో పోటా పోటీగా ఉన్నాయి.
జార్ఖండ్‌లోనూ బీజేపీ చిక్కుల్లో పడింది..
2019 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని 14 స్థానాలకు గాను 11 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అదే సమయంలో, 2024 లో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం కాషాయ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేఎంఎం 2, కాంగ్రెస్ 2, ఏజేఎస్‌యూ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుతం మిగిలిన రెండు సీట్లపై ఎలాంటి ట్రెండ్ లేదు.
బెంగాల్లో కూడా ఆశలు నెరవేరలేదు..
2019 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ 18 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఇక్కడ తన సత్తాను చాటుతుంది…తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. కానీ దీదీ మందు ఆ ఆటలు ఏమీ సాగలేదు. టీఎంసీ 29 స్థానాల ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతోంది.