నీలోఫర్ ఆసుపత్రిలో ఫైజల్ అనే ఆర్నెల్ల బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడి తల్లి భోజనానికి వెళ్ళేందుకు బయల్దేరగా…బాబుని ఎత్తుకుంటానని ఓ మహిళ కోరింది. ఆమెను నమ్మి మహిళ చేతికి బాలుడిని ఇచ్చి వెళ్ళింది తల్లి. తిరిగి వచ్చి చూసేసరికి చిన్నారి, మహిళ ఇద్దరూ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లి చుట్టుపక్కల అంతా వెతికింది. ఎంత వెతికినా కనిపించకపోతే భర్తతో కలిసి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన మీద కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.