Allu arjun : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్టుపై బిగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప2’తో బిజీగా ఉన్న బన్నీ.. దీని తర్వాత సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇటీవలే షారుఖ్ (sharukh) హీరోగా తెరకెక్కించిన ‘జవాన్’ (jawan) తో బిగ్ హిట్ ఖాతాలో వేసుకున్న తమిళ్ డైరెక్టర్ అట్లీ(atlee)తో బన్నీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ ప్రాజెక్టు ను తెరకెక్కించబోతున్నారని, ఇందులో బన్నీ న్యూలుక్లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాదిలో ఈ మూవీ షూగింట్ మొదలుపెట్టేందుకు అట్లీ పక్కా ప్లాన్ తో ఉన్నాడని, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : బ్లడ్ కారేదాకా వదలలేదు.. షూటింగ్ తర్వాత సర్జరీ చేయించుకున్నా : శ్రియారెడ్డి
ఇక ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ‘జవాన్’ సూపర్ హిట్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ ఆ చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘నా సినిమాకు కూడా ఇలానే మ్యూజిక్ అందించాలి’ అని ఆ పోస్ట్‌కు అట్లీని, మ్యూజిక్ దర్శకుడు అనిరుధ్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో త్వరలోనే అట్లీ-అల్లు అర్జున్‌ల కాంబోలో సినిమా రానుందని. దానికి అనిరుధ్ స్వరాలు అందించనున్నారని పోస్ట్‌లు దర్శనమిచ్చాయి.
ఇదిలావుంటే.. పుష్ప 2లో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరిపై క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారని, సుకుమార్ వెరీ ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఆగస్టు 15న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.