Trivikram: టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రిమ్ శ్రీనివాస్ సినిమా స్టోరీల విషయంలో గేర్ మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహేష్ బాబు (Mahesh babu), శ్రీలీల (Sree leela) జంటగా ఆయన తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ (Guntur karam)భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కాపీ కంటెంట్ అంటూ అభిమానులతోపాటు సినీ ప్రేమికులు సైతం త్రివిక్రమ్ ను ఆడేసుకున్నారు. గత సినిమా కథలన్నీ కలిపి గుంటూరు కారం తీశాడని మండిపడ్దారు.
జనాలకు బోర్ కొట్టేసిందా..
ఈ ఎఫెక్టుతో స్టోరీ ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట గురూజీ. ఆయన సినిమాలన్నీ ఫ్యామిలీ చుట్టు తిరగడం, విడిపోయిన కుటుంబాలను కలపడం, లేదా నష్టపోయిన ఆస్తులను దక్కించుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్ వంటి అంశాలే ప్రధానంగా చూపిస్తుంటారు. అయితే ఈ శైలీ జనాలకు బోర్ కొట్టేసింది. అనాటి నుంచి ఈనాటి దాకా అదే ధోరణిలో సినిమాలు తీస్తున్నాడని, జనరేషన్ కు అనుగుణంగా కథలు తెరకెక్కించలేకపోతున్నాడంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అరవింద సమేత.. వంటి సినిమాల కథలన్నీ కుటుంబ నేపథ్యానికి సంబంధించినవే కావడం విశేషం. కాగా గుంటూరు కారంలో కాస్త మాస్ యాంగిల్ చూపించినప్పటికీ జనాల మెప్పు పొందలేకపోయాడు.
ఇది కూడా చదవండి : Mizoram: 39మంది భార్యలు, 94మంది పిల్లలు.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీ మన భారతీయుడిదే!
యూనివర్సల్ కాన్సెప్ట్ తో..
అలాగే త్రివిక్రమ్ సన్నిహితులు సైతం స్టోరీలను డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్, ఫ్యామిలీ, లవ్ ఏదైనా ఈ జనరేషన్ కు తగ్గట్లు చిత్రీకరించాలనే ఆయన కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన రాబోయే సినిమాను కొత్తగా ప్లాన్ చేస్తున్నాడట. ఫ్యామిలీ గొడవలు పక్కనపెట్టి ఇకపై యూనివర్సల్ కాన్సెప్ట్ తో సినిమాలు తీయబోతున్నాడట. ఈ మేరకు త్వరలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ బడ్జెట్ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ యాంగిల్ లో అర్జున్ చూపించబోతున్నాడని, ఇందుకోసం భారీగానే ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు సీనీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.