CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21న జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలు గురించి జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ దే.. మాజీ ఎంపీ వినోద్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులు అయిన వారందరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అలాగే కౌలు రైతులను గుర్తించి వారికి కూడా రైతు భరోసా కింద ఏడాదికి రూ .12వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని.. దీంతో పాటు అర్హులైన మహిళలకు రూ.500లేక్ గ్యాస్ సిలిండర్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్!
ఎక్స్గ్రేషియా పెంపుపై తొలి సంతకం…
ఈ రోజు అటవీ శాఖ కార్యకలాపాలపై తొలి సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. ఈ సమావేశంలో అటవీ శాఖ పథకాలు, పనులపై సంరక్షణ అధికారి ప్రజంటేషన్ ఇచ్చారు. జంతువుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పెంచుతూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎక్స్గ్రేషియా పెంపుపై తొలి సంతకం చేశారు మంత్రి కొండా సురేఖ. ఎక్స్గ్రేషియా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను తెచ్చేందుకు అనుమతిస్తూ మరో సంతకం చేశారు. అటవీ, దేవాదాయ శాఖలో ఉన్న ఖాళీల వివరాలను తెలపాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. త్వరలోనే ఖాళీలను గుర్తించి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామి ఇచ్చారు.