Nepal Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లోని తనహున్ జిల్లాలో మార్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయిందని.. బస్సులో ఉన్న ప్రయాణికులు భారతీయులు అని చెప్పారు. పోఖారా నుండి ఖాట్మండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.
ఉత్తర ప్రదేశ్ చెందిన ‘UP FT 7623’ నంబర్ ప్లేట్ గల బస్సు నదిలో పడి నది ఒడ్డున పడి ఉందని జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ నుండి డీఎస్పీ దీప్‌కుమార్ రాయ తెలిపారు. కాగా సమాచారం ఆదుకున్న యూపీ గవర్నమెంట్.. ఈ ఘటనపై అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. సహాయక చర్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ అడిగి తెలుసుకున్నట్లు యూపీ రిలీఫ్ కమీషనర్ తెలిపారు. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
Nepal | An Indian passenger bus with 40 people onboard has plunged into the Marsyangdi river in Tanahun district, confirms Nepal Police.
“The bus bearing number plate UP FT 7623 plunged into the river and is lying on the bank of the river,” DSP Deepkumar Raya from the District…
— ANI (@ANI) August 23, 2024
BREAKING: Bus carrying 40 Indian passengers plunges into the Marsyangdi River in Nepal’s Tanahun district.
The bus was reportedly travelling to Kathmandu from Pokhara at the time of the accident. #Nepal #accident #nepalBusAccident pic.twitter.com/ObICxfXLxE
— Kamlesh Dhaker (@kamsa_dkd) August 23, 2024