Cinema: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ (Katrina Kaif) ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే సల్మాన్ (salman) సరసన ‘టైగర్ 3’ (Tiger 3) తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె.. తాజాగా ‘మెరీ క్రిస్మస్’తోనూ అభిమానులను అలరించింది. అయితే విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో తన నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న కత్రిన.. రీసెంట్ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ క్యారెక్టర్స్, మూవీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Katrina Kaif & #SidharthMalhotra promoting BBD at JDJ9 pic.twitter.com/r56Um3ybKO
— Katrina Kaif (@katreenakaif) January 5, 2017
ఈ మేరకు కత్రిన మాట్లాడుతూ.. ‘మారుతున్న కాలానికి అనుగుణంగా అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు మారుతూనే ఉంటాయి. అయితే నాకు కేవలం హీరోయిన్‌గానే కాకుండా అన్నిరకాల పాత్రల్లోనూ నటించాలనుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, పీరియాడిక్ సినిమాలు చేయాలనుంది. అలాంటి సినిమాలు నాతోపాటు అభిమానుల్లోనూ ఉత్సహాన్ని నింపుతాయి. మంచి పీరియాడిక్ స్టోరీ దొరికితే తప్పకుండా నటిస్తా. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్‌కు నేను పెద్ద అభిమానిని. ‘మెరీ క్రిస్మస్’ కోసం ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన సినిమాల్లో కామెడీతోపాటు మానవీయ కోణాలు కూడా ఉంటాయి. అందుకే శ్రీరామ్ ప్రాజెక్ట్ ఆఫర్ రాగానే ఆలోచించకుండా ఒప్పేసుకున్నా’అని చెప్పింది.
ఇది కూడా చదవండి :
Today’s My Birthday, 🎉🎈🥳I just want to thank God for adding another year to my life. #birthday #bollywood #KatrinaKaif pic.twitter.com/slPS95wTnl
— Katrina Kaif (@katreenakaif) July 16, 2019
తమిళ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘మెరీ క్రిస్మస్’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న తమిళం, హిందీ భాషల్లో విడుదలై పాజిటీవ్ టాక్ అందుకుని దూసుకుపోతుంది.