Allu Arjun at 69th National Film Awards Ceremony: భారతీయ సినిమా వందేళ్లు పైబడిన హిస్టరీలో, 90ఏళ్ల చరిత్ర టాలీవుడ్ (Tollywood) కి ఉంది. తొమ్మిది దశాబ్ధాల్లో టాలీవుడ్ ఎందరో సూపర్ స్టార్లను పరిచయం చేసింది. కానీ, వీళ్లలో ఎవరూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ (National Award) అందుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎవరికీ ఆ గౌరవం దక్కలేదు. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ చలన చిత్రసీమ అని భావించేవారు. అసలు సౌత్ ఇండస్ట్రీలకు ఒక గుర్తింపు అన్నదే లేదు. పైగా ఇక్కడి స్టార్లను వారంతా చులకనగా చూసేవారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్వయంగా అనుభవించి మరీ ఆవేదన చెందారు. మన లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటి వారికి దిల్లీ లైబ్రరీలో గౌరవం దక్కలేదని తెలిపారు. వారి ఫోటోలను కనీసం దిల్లీ సినిమా లైబ్రరీలో ఉంచలేదని అన్నారు.
అదంతా అటుంచితే ఇప్పుడు దిల్లీ మనవైపు తిరిగి చూసేలా.. తనదైన ప్రతిభతో సత్తా చాటారు అల్లు అర్జున్ (Allu Arjun). భారతీయ సినీచరిత్రలో తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయేలా.. బన్ని ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడిగా తొలి పురస్కారాన్ని తెలుగు లోగిళ్లలోకి తెస్తున్నాడు. దశాబ్ధాల ఘనచరిత కలిగి ఉన్న టాలీవుడ్ కి ఉత్తమ నటుడిగా తొలి జాతీయ అవార్డును (Best Actor in 69th National Film Awards) అందుకుంటున్నాడు.
Also Read: సెట్స్ లో ఎవరూ లేని సమయంలో శ్రీలీల ఆయనను అలా పిలుస్తుందట..!!
నేడు దిల్లీలో జరగనున్న జాతీయ అవార్డుల కార్యక్రమంలో, అల్లు అర్జున్ జాతీయ పురస్కార ట్రోఫీని అందుకోనున్నాడు. దీనికోసం భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ దిల్లీకి బయల్దేరిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ.. సినిమా కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.
తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి మొన్నటి ‘పుష్ప-1’ (Pushpa) వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం ఉంటుంది. మాస్, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇలా అందరిని మెప్పిస్తూ, దక్షిణాదిన అంత్యంత విజయవంతమైన హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలో తనకంటూ ఓ స్టైల్‌ని ఫాలో అవుతూ స్టైలీష్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ.. టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేశాడు.
అసలు అల్లు అర్జున్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఒక బలమైన కారణం ఉంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారనే విషయం అందరికి తెలిసిందే. అలా ఒకసారి చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో, అల్లు అర్జున్ కూడా పాల్గొన్నాడు. చాలా మంది డ్యాన్స్ చేస్తుంటే.. బన్నీ కూడా వెళ్లి డాన్స్ చేసాడు. అయితే తన డ్యాన్స్ మాత్రం అందరికంటే డిఫెరెంట్ గా ఉండడంతో అందరి చూపులు బన్నీవైపు తిరిగాయి. అందరితో పాటు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు కూడా బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి నిర్మల దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను’అని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అన్నట్లుగానే రాఘవేంద్రరావు ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశాడు. రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గరే ఉందట.
ఇక క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)’ఆర్య’ సినిమాలో, లవర్ బాయ్‌గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సెషన్. ఇక మూడో సినిమా ‘బన్నీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్‌ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు. టాలీవుడ్‌కి సిక్స్‌ప్యాక్‌ని పరిచయం చేసింది అల్లు అర్జునే. ‘దేశ ముదురు’ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్‌ప్యాక్‌తో కనిపించాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ‘గంగోత్రి’లో అమాయకుడిగా కనిపించే బన్నీ ‘దేశముదురు’లో మాత్రం సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి అలరించాడు. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ ఇలా చాలామంది హీరోలు సిక్స్‌ప్యాక్ చూపించారు.
అల్లు అర్జున్‌ని ఇన్నాళ్లు అంతా స్టైలీష్ స్టార్ అని పిలిచేవారు. కానీ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీకి మరో బిరుదు ఇచ్చాడు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ని ఐకాన్ స్టార్ చేసేశాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏ సినిమా కూడా ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేయలేదు. ఇక పుష్ప సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద కెలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా టాలీవుడ్ కు అందని ద్రాక్షలా ఉన్న నేషనల్ అవార్డు ను తెచ్చిపెట్టింది. అందుకే జూరీ అన్ని సినిమాల్ని, వాటిలో నటించిన హీరోల్ని పక్కన పెట్టి, అల్లు అర్జున్ కి పట్టంగట్టింది. ఒక కమర్షియల్ సినిమాలో మాస్ హీరోగా బన్నీ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకోవడం సినిమా చరిత్రలో ఒక సంచలనం అని చెప్పాలి. పుష్ప 2తో మరోసారి సంచలనం నమోదు చేయాలని బన్ని కలలుగంటున్నాడు. ఈసారి ఏకంగా 1000 కోట్ల క్లబ్ పై కన్నేశాడు.