Nalgonda SI: ఇటీవల కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఎస్సై రేప్ చేయడం మర్చికపోకముందే ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లాలో ఎస్ఐ లైంగిక వేధింపుల కలకలం రేపింది. శాలిగౌరారం ఎస్సై ప్రవీణ్ కుమార్ ఓ మహిళను లైంగికంగా వేధించాడు. భూ వివాదంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు బాధితురాలు రాగ.. తనతో క్లోజ్‌గా ఉంటేనే కేసు పరిష్కరిస్తాననీ మహిళను ఎస్సై ప్రవీణ్ కుమార్ వేధించాడు. ఎస్సై వేధింపులు తాళలేక బాధిత మహిళా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు ఆదేశించారు ఎస్పీ శరత్ చంద్ర పవర్.