Director Krishna Vamsi : సూపర్ స్టార్ మహేష్ – కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన ‘మురారి’ అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని మహేష్ కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకు ఇప్పటికీ విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మహేష్ ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ఆడియన్స్ సైతం రీ రిలీజ్ ను తెగ ఎంజాయ్ చేశారు.
కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఇదిలా ఉంటే గత కొద్దీ రోజులుగాఈ సినిమాకు సీక్వెల్ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మహేశ్ కొడుకు గౌతమ్‌ను హీరోగా పెట్టి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు న్యూస్ వచ్చింది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు కృష్ణవంశీ స్పందించాడు.
Also Read : షారుక్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసిన ‘KGF’ నటి.. కారణం అదే అంటూ
మురారి సీక్వెల్ అంటూ వస్తున్న వార్తలను నమ్మకండి. అవి ఫేక్, సీక్వెల్ లేదని తెలిపాడు. అయితే ఈ పోస్ట్‌పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. మురారి సినిమాకు సీక్వెల్ లేదన్నారు ఓకే.. కనీసం ప్రీక్వెల్ అయిన ఉందని అనుకొవచ్చా సర్ అంటూ పోస్ట్ పెట్టగా.. అందుకు కృష్ణవంశీ ‘హ..హా.. గాడ్ బ్లెస్ యూ’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.