Municipal Commissioners: ఏపీలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలోని 24 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ చేసింది చంద్రబాబు సర్కార్. కమిషనర్ల బదిలీపై మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు కమిషనర్లను మాతృశాఖకు బదిలీ చేసింది ప్రభుత్వం. మరికొంతమంది కమిషనర్లను మున్సిపల్ శాఖ డైరెక్టర్ కు రిపోర్ట్ చేయాలని వెల్లడించింది.
ఇటీవల భారీగా IPSల బదిలీలు…
ఇటీవల ఏపీలో ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌ల బదిలీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. అటవీశాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌గా రాం ప్రకాష్ సిసోడియాకు బాధ్యతలు అప్పగించారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా జయలక్ష్మి, కన్నబాబుకు సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు.