America: పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా మరో సరికొత్త వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. శనివారం జరిగిన 4×400 మీటర్ల మిక్స్డ్ రిలేలో నోర్వుడ్, లిటిల్, డెడ్మాన్, బ్రౌన్తో కూడిన బృందం ఫస్ట్ హీట్స్లోనే 3 నిమిషాల 7.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో గతేడాది నెలకొల్పిన తన రికార్డు (3 నిమిషాల 8.80 సెకన్లు)నే అమెరికా తిరగరాసింది. ఇక అమెరికాతోపాటు ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం, నెదర్లాండ్స్, జమైకా, పోలండ్, ఇటలీ రిలే ఫైనల్కు చేరుకున్నాయి.