TS NEWS: తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నత విద్యపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది సర్కార్. సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2500కోట్ల మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా కాకుండా ఒకేచోట నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద తాను ప్రాదినిత్యం వహిస్తున్న మధిర నుంచే చేపట్టనున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రమైన చింతకానిలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న పది ఎకరాల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ బాలుర, ఎర్రపాలెం మండలంలో బాలిక రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని తెలిపారు.
🔹 ఇంటర్నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్స్
• రూ.2500 కోట్లతో 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం
• ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యం కోసం నియోజకవర్గ కేంద్రాల వారీగా నాలేడ్జ్ కేంద్రాల ఏర్పాటు… pic.twitter.com/FRosClYHNt
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) February 22, 2024
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పాఠశాలల భవన సముదాయాల కోసం స్థలాలు గుర్తించాలని అధికారులను భట్టి ఆదేశించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కు దీటుగా భవనాలు నిర్మించాలని విద్యాశాఖను ఆదేశించారు. ఒకేచోట నిర్మిస్తే స్థలాల సమస్య అధిగమించడంతోపాటు మినీ ఎడ్యుకేషన్ హబ్ గా డెవలప్ చేసేందుకు వీలు ఉంటుందని డిప్యూటీ సీఎం అన్నారు.
ఇదికూడా చదవండి: గ్రూప్-2, 3 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!!