Malayalam Senior Actor Indrans : ప్రముఖ మలయాళ నటుడు ఇంద్రన్ తాజాగా 7వ తరగతి పరీక్ష రాశారు. ఈ విషయం ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పరీక్ష పూర్తి చేసుకున్న తర్వాత ఆనందంగా ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు. 63 ఏళ్ళ వయసులో ఆయన ఏడో తరగతి పరీక్షలు రాయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. చిన్నప్పుడు నాలుగో క్లాస్ వరకే చదువుకున్న ఇంద్రన్.. ఆ తర్వాత చదువు మానేసి టైలర్ గా మారాడు.పెద్దయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ
Actor Indrans appears for the seventh standard equivalency exam held at the Attakulangara Government HSS under the aegis of State Literacy Mission.@NewIndianXpress video by @PulickalVincent@MSKiranPrakash @PaulCithara @VSivankuttyCPIM @rbinducpm #Indrans #Education #Kerala pic.twitter.com/wRb7M0HbHQ
— TNIE Kerala (@xpresskerala) August 24, 2024
కాగా ఇంద్రన్కి 10వ తరగతి పాస్ కావాలనే కోరిక కలిగింది. ఇది జరగాలంటే ఫస్ట్ 7వ తరగతి పాస్ కావాలని రూల్ ఉంది. దీంతో తాజాగా తిరువనంతపురంలోని అట్టకుళంగర సెంట్రల్ స్కూల్లో ఏడో తరగతి పరీక్షలు రాశాడు.1980 నుంచి ఇంద్రన్ మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన ‘2018’ అనే డబ్బింగ్ మూవీలో అంధుడి పాత్ర పోషించాడు. ఇందుకు గానూ ఉత్తమ నటుడిగా కేరళ ఫిల్మ్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు.